Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం...

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (12:41 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 8వ తేజీ నుంచి 10వ తేదీ వరకు పర్యటించనున్నారు. వచ్చే సెప్టెంబరు 30వ తేదీ లోపు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యపంథాలో ఎన్నికలు నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుంది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకుప క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించనుంది. 
 
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు పర్యటిస్తారు. రాజకీయ పార్టీలతో తొలుత కమిషన్ సమావేశమవుతుంది. సీఈవో, ఎస్పీఎనోవో, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్‌తోనూ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్రధాన కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కమిషన్ సమావేశమై ఎన్నికల సన్నాహకాలను సమీక్షిస్తుంది. 
 
ఆగస్టు 10వ తేదీన జమ్మూలో పర్యటించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమావేశం అవుతుంది. అనంతరం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనుంది. సీఈసీ రాజీవ్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు, గత మార్చిలోనూ జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. 
 
ఆ సమయంలోనే యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంపైనా కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం