2024 సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం

Webdunia
బుధవారం, 10 మే 2023 (10:05 IST)
భారత ఎన్నికల సంఘం మినీ సార్వత్రిక సమరానికి సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రెఢీ అవుతుంది. ఉమ్మడి ఎన్నికల గుర్తుల కోసం పార్టీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్‌ అండ్‌ అలాట్‌మెంట్‌) ఆర్డర్‌ 1968లోని పేరా 10-బిని అనుసరించి 2023-24 సంవత్సరాల్లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఉమ్మడి గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
 
ఈసీ జారీ చేసిన ఆదేశాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు జులై 17 తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 12 తర్వాత, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు డిసెంబరు 17 తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 
 
వచ్చే ఏడాది కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. 
 
తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో, ఏపీ అసెంబ్లీ గడువు 2024 జూన్‌ 11తో, లోక్‌సభ గడువు 2024 జూన్‌ 16తో ముగియనున్నట్లు  వెల్లడించింది. ఒకవేళ ఏదైనా అసెంబ్లీ గడువు తేదీ కంటే ముందే రద్దయితే, ఆ రోజు నుంచి నోటిఫికేషన్‌ జారీ చేసే నాటికి అయిదురోజుల ముందు వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments