Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌‍ను "పప్పు" అనకూడదు.. మరి లోకేశ్‌ను...

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అంటూ పిలవడానికి వీల్లేందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు నిషేధం విధించింది. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీ నేతలు రాహుల్‌పై త

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (16:29 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అంటూ పిలవడానికి వీల్లేందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు నిషేధం విధించింది. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, బీజేపీ నేతలు రాహుల్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులోభాగంగా, రాహుల్‌ను పప్పు అంటూ సంబోధిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 
 
దీనికి సాక్ష్యాలుగా బీజేపీ నేతల ప్రసంగాల స్క్రిప్టును కూడా పంపింది. ప్రసార మాధ్యమాలకు ఇచ్చిన ఓ ప్రకటనలో సైతం రాహుల్‌ను 'పప్పు' అని బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. 'పప్పు' అన్న పదం అభ్యంతరకరమేనని తేల్చింది. ఓ నేతను అలా పిలవడం అవమానించడమేనని పేర్కొంటూ, ఆ పదాన్ని నిషేధిస్తున్నట్టు తెలిపింది. 
 
ఇదిలావుండగా, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను వైకాపా నేతలు పదేపదే పప్పూ.. పప్పూ అంటూ సంబోధిస్తున్నారు. ముఖ్యంగా, సెర్చింజన్ గూగుల్‌లో కూడా పప్పు అని టైప్ చేస్తే లోకేశ్ పేరే వస్తోంది. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ, వైకాపా నేతలు మాత్రం ఆ పదాన్ని మరింతగా వాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments