ఇంకా పెళ్లికాలేదు.. అలాగనీ నేను నపుంసకుడినికాను.. హార్దిక్ పటేల్
గుజరాత్ టీవీ చానెళ్లలో పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ ప్రసారమైన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. అలాగని నపుంసకుడిని కాదంటూ ఘాటుగానే బదులిచ్చారు.
గుజరాత్ టీవీ చానెళ్లలో పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ ప్రసారమైన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని.. అలాగని నపుంసకుడిని కాదంటూ ఘాటుగానే బదులిచ్చారు. తనకు చెడ్డపేరు రావడానికి భారతీయ జనతా పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని.. దీన్ని ఇతర దేశాల నుంచి అప్‌లోడ్ చేశారని, అదొక ఫేక్ వీడియో అంటూ వివరణ ఇచ్చారు.
తమ ఉద్యమం వల్ల బీజేపీకి అపారనష్టం వాటిల్లనుందని, అందువల్లే ఈ తరహా కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, తమను, తమ ఉద్యమాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని ఫైర్ అయ్యారు. మార్ఫింగ్‌తో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్ర తనపై జరుగుతుందని గతంలోనే తెలిపానని గుర్తు చేశారు. ఈ వీడియోపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు.
కాగా, 4 నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియోలో ఓ మహిళతో 2017 మే 16న హార్ధిక్ పటేల్‌ను పోలిన వ్యక్తి రాసలీలలు జరిపినట్లు ఓ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక పటీదార్ ఉద్యమనేత అయిన హార్ధిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఆయన ఉన్నట్టుగా ఉండే రాసలీలల వీడియో ఒకటి మరోమారు తెరపైకి వచ్చింది.