Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

హిందువులు భరతమాతకు తిలకం దిద్దితే.. టోపీ, గడ్డం పెట్టే దమ్ము ముస్లింలకు లేదా: అక్బరుద్దీన్ ఓవైసీ

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఓవైసీ బ్రదర్స్ ముందుంటారు. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భరతమాతపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్లు చేశారు. భరతమాత నుదుటి

Advertiesment
Parliament seats
, మంగళవారం, 4 జులై 2017 (10:00 IST)
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఓవైసీ బ్రదర్స్ ముందుంటారు. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. భరతమాతపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్లు చేశారు. భరతమాత నుదుటిన హిందువులు తిలకం దిద్ది వీధుల్లో తిరిగితే.. భరతమాతకు టోపీ, గడ్డం పెట్టి తిరిగే దమ్ము ముస్లింలకు ఉందంటూ వ్యాఖ్యానించారు. 
 
భిన్నత్వంలో ఏకత్వం ప్రాతిపదికగా ఉన్న దేశంలో హిందువులకు ఎంత హక్కు ఉందో, ముస్లింలకూ అంతే హక్కు ఉందని అక్బరుద్దీన్ తెలిపారు. ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్, అసెంబ్లీల్లో చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ముస్లింలు మేలుకోకపోతే.. కష్టాలు తప్పవని హెచ్చరించారు.
 
ఇకపోతే.. హిందూ, ముస్లింల మధ్య ఎంఐఎం సోదరులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలు చిచ్చుపెడుతున్నారని శివసేన నాయకురాలు మనీషా కాయందీ ఫైర్ అవుతున్నారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లింలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంటునే కాకుండా, ప్రధాని మోదీని కూడా అవమానిస్తూ కామెంట్లు చేశారని.. అయినప్పటికీ అక్బరుద్దీ‌న్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ముస్లింల ఓట్లను పెంచుకోవడానికే ఒవైసీ సోదరులు విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒవైసీ సోదరులకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని... తక్షణమే వారు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచివాలయంలో మెట్లు ఎక్కబోతూ జయమ్మ అదుపు తప్పారు: శశికళ భర్త నటరాజన్