Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు మళ్లీ ఈడీ ముందుకు రాహుల్ - తొలి రోజు 10 గంటల విచారణ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (07:35 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రెండో రోజైన మంగళవారం కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో ఆయన వద్ద తొలి రోజున 10 గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరిపారు. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి రాత్రివరకు జరిగింది. తొలి రోజు విచారణ పూర్తి చేసుకుని ఈడీ కార్యాలయం నుంచి రాత్రి 9.30 గంటలకు బయటకు వచ్చారు. అంటే తొలి రోజున మొత్తం 10 గంటల పాటు విచారణ ఆయన వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
తొలి రోజున సుధీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు రాహుల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చినట్టు సమాచారం. అంటే ఈ లిఖిత పూర్వక సాక్ష్యాధారాలుగా ఈడీ అధికారులు పరిగణించే దిశగా ఈడీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా, రెండో రోజైన మంగళవారం కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారణకు రావాలని ఆదేశించారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత ఈ మేరకు వారు రాహుల్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. ఫలితంగా ఆయన మంగళవారం కూడా ఈడీ కార్యాలయానికి రానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments