పీకల వరకు మద్యం సేవించి హాస్టల్‌లో నగ్నంగా నిద్రపోయిన స్కూల్ హెడ్మాస్టర్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ తంతుకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ కావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, సదరు హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని బాహఖ్ జిల్లా విశేశ్వర్ గంజ్ బ్లాక్‌లోని శివపూర్ బైరాగీ పాఠశాలలో ఓ హెడ్మాస్టర్ పూటుగా తాగి నగ్నంగా నిద్రిపోయాడు. దీన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అయింది.
హెడ్మాస్టర్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. నిందితుడు దుర్గా జైశ్వాల్ తరచూ పాఠశాలలో అసభ్యకరమైన చర్యలకు పాల్పడేవాడని ఆరోపించారు. పిల్లల ముందు షర్టు తొలగించేవాడని, అతడి తీరుతో బాలికలు స్కూలుకు వెళ్లడం మానేశారని చెప్పారు.