మహిళకు మధ్య వేలు చూపించిన 33 ఏళ్ల వ్యక్తి: ఆరు నెలల జైలు శిక్ష

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:20 IST)
మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు గాను ముంబై కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. వివరాల్లోకి వెళితే.. 2018 సెప్టెంబర్ 17న ఓ మహిళ తన కుమారుడితో కలిసి కారులో ఆఫీసుకు వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎడమ వైపు నుంచి మరో కారు వారి కారు ముందుకు వచ్చింది. దీంతో వారు కంట్రోల్ కోల్పోయారు. ఆమె కారు 100 మీటర్ల వరకు అడ్డదిడ్డంగా దూసుకెళ్లింది. ఆ తర్వాత ఎలాగోలా కంట్రోల్‌లోకి వచ్చింది. 
 
ఆ తర్వాత సిగ్నల్ వద్దకు వచ్చి ఆగింది. ఆ సమయంలో మరో కారు వారి పక్కనే ఆగింది. అయితే సదరు మహిళ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వచ్చిందంటూ కారులోని 33 ఏళ్ల వ్యక్తి వారిని దూషిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా... ఆమె కుమారుడు తమ కారును ఆ వ్యక్తి కారుకు అడ్డుగా పెట్టాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది.
 
ఆ తర్వాత పోలీసులు సీన్‌లోకి ఎంటరై తల్లీకుమారులను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఈ వాదనలు జరుగుతున్న సమయంలో ఆ యువకుడు మధ్య వేలిని చూపించాడు. దీంతో, ఆ యువకుడిపై సదరు మహిళ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసును విచారించిన కోర్టు యువకుడికి శిక్షను విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

తర్వాతి కథనం
Show comments