పొడి రూపంలో డీఆర్డీవో ఔషధం... నేటి నుంచి వినియోగం

Webdunia
సోమవారం, 17 మే 2021 (08:10 IST)
భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) సోమవారం నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.
 
ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ సహకారంతో డీఆర్‌డీవో 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీని వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది సహకరిస్తుందని కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌డీవో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments