Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గాడిదల పేర్లు గుర్మీత్‌, హనీప్రీత్‌, జీఎస్టీ, బాహుబలి, జియో... ఎక్కడ?

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ అలియాస్ డేరా బాబా, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా బాబాకు 20 యేళ్ల జైలు శిక్ష

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (09:31 IST)
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ అలియాస్ డేరా బాబా, ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం జరిపిన కేసులో డేరా బాబాకు 20 యేళ్ల జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత కొంతకాలం అజ్ఞాతవాసం తర్వాత హనీప్రీత్ కూడా పోలీసులకు లొంగిపోయింది. దీంతో వీరిద్దరి పేర్లు దేశ వ్యాప్తంగా మార్మోగి పోయాయి. 
 
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని ప్రతియేటా నిర్వహించే గాడిదల మేళాలో కొన్ని గాడిదలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎందుకంటే వాటికి డేరా బాబా, హనీప్రీత్‌, జీఎస్టీ, సుల్తాన్, జియో అని పేరు పెట్టారు. ఈ మేళాలో వాటిని రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. ఆ రెండు గాడిదలు రూ.11 వేలకు అమ్ముడుపోయాయి. ఈ మేళాలో గాడిదలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి అమ్మడం ఏటా జరుగుతుందట. 
 
అలాగే ఈ యేడాది కూడా గాడిదలకు రకరకాల పేర్లు పెట్టి అమ్మకాలు జరిపారు. వాటిలో కొన్నింటికి 'జీఎస్టీ', 'సుల్తాన్', 'బాహుబలి', 'జియో' అని కూడా పేర్లు పెట్టారు. గుర్మీత్‌, హనీప్రీత్‌ గాడిదలను రూ.20 వేలకు అమ్మకం జరపాలని దాని యజమాని అనుకున్నాడు. కానీ వాటిని అంత ధరకు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో చివరికి రూ.11 వేలకు అమ్మాల్సి వచ్చింది. ఏటా జరిగే ఈ మేళాలో మహారాష్ట్ర, రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గాడిదలను కొనుగోలు చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments