Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవలలకు జన్మనిచ్చిన మహిళ.. కడుపులో టవల్ పెట్టి కుట్టేశారు..

సెల్వి
సోమవారం, 12 ఆగస్టు 2024 (10:11 IST)
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెలివరీ కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ పెట్టి కుట్టేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆలీగఢ్ లోని జీటీ రోడ్డు లో గల శివ్ మహిహా ఆసుపత్రికి ఇటీవల వికాస్ కుమార్ అనే వ్యక్తి తన భార్యను డెలివరీ కోసం తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు కవలలు జన్మించారు. 
 
ఆపరేషన్ సమయంలో వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం ఆ తర్వాత బయటపడింది. ఆపరేషన తర్వాత ఆమెకు కడుపులో నొప్పి రావడంతో వేరే ఆస్పత్రి వైద్యులు చెక్ చేయడంతో అసలు సంగతి బయటపడింది. ఆమె కడుపులో టవల్ వుండటాన్ని వైద్యులు టెస్టుల ద్వారా కనుగొన్నారు. వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని టవల్ ను తొలగించి ఆమెను కాపాడారు. 
 
ఆపరేషన్ సమయంలో వైద్యుల నిర్లక్ష్యానికి సీరియస్ అయిన ఆమె భర్త  తాజా శస్త్ర చికిత్సకు సంబంధించిన వీడియోను జత చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేశారు. 
 
ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తునకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments