Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (10:02 IST)
బీహార్ రాష్ట్రంలోని సిద్ధేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. 
 
జెహానాబాద్ జిల్లాలోని వనహార్ హిల్స్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో ఈ తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, శ్రావణమాసం నాలుగో సోమవారం (ఉత్తరాదిలో) పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున సిద్ధేశ్వర్ స్వామి శివాలయానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండటం, సమయం గడుస్తున్న కొద్దీ మరింత భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట ఒక్కసారిగా జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు వెనుక ఆర్థిక, రాజకీయ, అంగబలం : ముంబై నటి జెత్వానీ

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments