ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం

Webdunia
గురువారం, 1 జులై 2021 (18:44 IST)
ఒడిశాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం జరిగిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. మహిళా వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న వైద్యురాలిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన.. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో జరిగింది. 
 
అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్‌ పార్శిల్‌ పంపాడు. అనంతరం ఆ ఫుడ్ పార్శిల్‌ను తీసుకొని దాబా యజమాని కుమారుడు.. మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు.
 
ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై దాబా యజమాని కుమారుడు బెహరా అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. సోదరుడు ఇంటికి రాగానే.. మహిళా వైద్యురాలు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అంగూల్ జిల్లా పోలీసులు తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments