Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ నర్సుకు మత్తు సూది వేసి రేప్ చేసిన వైద్యుడు

తల నొప్పిగా ఉంది .. టాబ్లెట్ రాసివ్వమని వైద్యుడి వద్దకు వెళ్లిన ఓ ట్రైనీ నర్సు అత్యాచారానికిగురైంది. వైద్యం పేరుతో ట్రైనీ నర్సుకు మత్తు సూది వేసిన వైద్యుడు.. ఆమెతో తన కోర్కె తీర్చున్నాడు.

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (09:04 IST)
తల నొప్పిగా ఉంది .. టాబ్లెట్ రాసివ్వమని వైద్యుడి వద్దకు వెళ్లిన ఓ ట్రైనీ నర్సు అత్యాచారానికిగురైంది. వైద్యం పేరుతో ట్రైనీ నర్సుకు మత్తు సూది వేసిన వైద్యుడు.. ఆమెతో తన కోర్కె తీర్చున్నాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని సింగనల్లూరు పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సింగనల్లూరు పట్టణంలో డాక్టర్ రవీంద్రన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. దిండిగల్ ఇన్‌స్టిట్యూట్‌లో మొదటి సంవత్సరం నర్సింగ్ డిప్లొమా చదువుతున్న 11 మంది అమ్మాయిలు శిక్షణ పొందేందుకు రవీంద్రన్ ఆసుపత్రిలో చేరారు. 17 ఏళ్ల ఓ ట్రైనీ నర్సు తాను జలుబుతో బాధపడుతున్నానని మందులు ఇవ్వమని డాక్టరును సంప్రదించింది.
 
అంతే డాక్టరు జలుబుకు చికిత్స చేస్తున్నట్టు చెప్పి మత్తు ఇంజక్షన్ వేశాడు. అనంతరం తన గదిలోకి తీసుకెళ్లి ట్రైనీ నర్సుతో కోర్కె తీర్చుకున్నాడు. ఆ తర్వాత సృహలోకి వచ్చిన ట్రైనీ నర్సు తనకు జరిగిన ఘోరం గ్రహించి సాటి విద్యార్థినిలకు చెప్పింది. 
 
అలాగే, సదరు వైద్యుడి భార్యకు, కోయంబత్తూర్ ఛైల్డ్ లైన్ కో ఆర్డినేటరుకు ఫిర్యాదు చేశారు. చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సులేఖ ఫిర్యాదు మేర మహిళా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన డాక్టర్ రవీంద్రన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రైనీ నర్సుకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments