Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల-ఉచితంగా ట్యాబ్‌లు, పెట్రోల్ తగ్గింపు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (16:54 IST)
తమిళనాడులో వచ్చే నెల ఎన్నికలు జరుగున్నాయి. ఇందులో భాగంగా డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే తమిళనాట ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రజలను ఆకర్షించే పథకాల రచన చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
 
విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించినట్లు స్టాలిన్ తెలిపారు. ప్రజలకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై ప్రధానంగా ఈ పార్టీ దృష్టి సారించింది. తమను గెలిపించినట్లయితే…లీటర్ పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 4 తగ్గిస్తామని, అలాగే.. వంట గ్యాస్ సిలిండర్ రాయితీ రూ. 100 ఇస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.
 
మహిళల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 12 నెలల పాటు ప్రసూతి హాలీడేస్ ఇస్తామని వెల్లడించింది. విద్యార్థులపై ప్రధానంగా దృష్టి సారించింది ఆ పార్టీ. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవ.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments