Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులిచ్చి వేరే యువతిని పెళ్లాడిన భర్త.... వధువుపై గ్యాంగ్ రేప్ చేయించిన మాజీ భార్య

తనకు విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్న మాజీ భర్తపై మాజీ భార్య పగ తీర్చుకుంది. అదేలాగో తెలుసుకుని పోలీసులే షాకయ్యారు. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని పానిపట్టులో గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళను 2013లో పెళ్లాడాడు ఓ యువకుడు. ఐతే పెళ్లి చేసుకున

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (13:56 IST)
తనకు విడాకులు ఇచ్చి మరో యువతిని పెళ్లి చేసుకున్న మాజీ భర్తపై మాజీ భార్య పగ తీర్చుకుంది. అదేలాగో తెలుసుకుని పోలీసులే షాకయ్యారు. వివరాల్లోకి వెళితే... హర్యానాలోని పానిపట్టులో గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళను 2013లో పెళ్లాడాడు ఓ యువకుడు. ఐతే పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి భార్య అతడికి నరకం చూపించింది. పొద్దస్తమానం అరుపులు కేకలు వేస్తూ నానా రచ్చ చేసేది. ఈ పోరు భరించలేని సదరు భర్త తనకు విడాకులు కావాలని కోర్టుకెక్కాడు. 
 
ఇరువురి వాదనలు విన్న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇది గత డిసెంబరు నెలలో జరిగింది. ఆ తర్వాత నుంచి మరో పెళ్లి చేసుకునేందుకు మాజీ భర్త సంబంధాలు వెతికి వెతికి చివరికి ఓ అమ్మాయి నచ్చడంతో గత వారం ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్లు చిలకాగోరింకల్లా హాయిగా వుండటాన్ని చూసిన మాజీ భార్య తట్టుకోలేకపోయింది. బుధవారం నాడు తన బంధువులతో నేరుగా మాజీ భర్త ఇంటికి వెళ్లింది. 
 
వారంతా కలిసి మాజీ భర్తతో పాటు, అతడి తల్లిని, అతడిని పెళ్లాడిన యువతిని చితక బాదారు. ఆ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలను ఇద్దరినీ వేర్వేరు వాహనాల్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు. వాహనంలోనే తను విడాకులిచ్చినట్లే తన మాజీ భర్తకు విడాకులివ్వాలని నవ వధువుపై వత్తిడి చేసింది సదరు మహిళ. కానీ ఆమె అందుకు నిరాకరించడంతో తన బంధువులను పురమాయించి కదులుతున్న వాహనంలోనే ఆమెపై అత్యాచారం చేయించింది. ఇలా సుమారు అర్థరాత్రి దాటేవరకూ ఇద్దర్నీ చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత సమీపంలోని బస్టాండులో విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం