ఇపుడు ట్రెండ్ మారింది గురూ... భార్య దెబ్బకు భర్త భుజం విరిగింది... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:10 IST)
ఒకపుడు భార్యను భర్త చావబాదేవాడు. భర్త కొట్టే దెబ్బలను తాళలేక భార్య లబోదిబోమని ఏడుస్తూ ఇరుగుపొరుగు ఇళ్లలోకి తలదాచుకునేది. కానీ ఇపుడు ట్రెండ్ మారింది. భార్య చేతిలో భర్తలు తన్నులు తింటున్నారు. భార్యలే భర్తలను ఉతికి ఆరేస్తోంది. దానికి పెద్ద‌గా కార‌ణం కూడా అవ‌స‌రం లేదు. ఒక మాట ఎదురు మాట్లాడితే చాలు. ఇదిగో ఇత‌ని భుజం విరిగిన‌ట్లు విర‌గాల్సిందే. గుజరాత్ రాష్ట్రంలోని అమ్మదాబాద్‌లోని వాస్నాలో జరిగిన ఈ వింత సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
హ‌ర్ష‌ద్ అనే భర్త చక్కెరవ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యుల సలహా మేరకు కొన్ని వంటకాలు తినకుండా దూరంగా ఉంచసాగాడు. ఈ క్రమంలో బంగాళా దుంపల కర్రీ తిన‌కూడ‌దు. కానీ ఆ రోజు అత‌ని భార్య మాత్రం చ‌పాతీల్లోకి ఆలూ కర్రీ చేసింది. 'ఇది ఎందుకు చేశావు. నేను తిన‌కూడ‌దు అని తెలుసు క‌దా. తెలిసి కూడా కావాల‌నే చేశావు క‌దా' అని అన్నాడు. అంతే.. 
 
ఇక చూడు బ‌య‌ట‌కు వెళ్లి బ‌ట్ట‌లు ఉతికే క‌ర్ర‌ను తీసుకొచ్చి భ‌ర్త‌ను ఫ‌ట్‌ఫ‌ట్‌మ‌ని వాయించేసింది. ఆ దెబ్బ‌కి అత‌ని అరుపులు ఇంటి చుట్టుప‌క్క‌లకు వినిపించాయి. వారు వ‌చ్చి కాపాడేంత వ‌ర‌కు అత‌ను దెబ్బ‌లు తింటూనే ఉన్నాడు. త‌ర్వాత అత‌న్ని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో భుజం ఎముక విరిగిందట. 
 
దీంతో హ‌ర్ష‌ద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. జ‌రిగిందంతా చెప్పి ఎఫ్ఐఆర్ న‌మోదు చేశాడు. ఆ దెబ్బ‌ల‌కు హ‌ర్ష‌ద్ కుడి భుజం విర‌గ‌డంతో పోలీసులు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ ఘ‌ట‌న అహ్మదాబాద్‌లోని వాస్నాలో చోటుచేసుకున్న‌ది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments