Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీప్రీత్ సింగ్‌కు కత్రినా అంటే ఇష్టం.. డేరా బాబాతో ఒకే గదిలో వుండేదట...

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌కు పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రేప్‌ కేసులో పంచకుల కోర్టులో దోషిగా తేలిన తర్వాత గుర్మీత్‌ తప్పించుకునే ప్రయత్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (10:00 IST)
డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ దత్త పుత్రిక హనీప్రీత్‌కు పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రేప్‌ కేసులో పంచకుల కోర్టులో దోషిగా తేలిన తర్వాత గుర్మీత్‌ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు...ఇందుకు హనీప్రీత్‌ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. ఫలితంగా హనీప్రీత్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ రామ్‌ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. 
 
అప్పటి నుంచి గుర్మీత్‌కు ఎప్పుడూ నీడలా ఉండే హనీప్రీత్‌ అలియాస్ ప్రియాంకాతనేజా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆమె నేపాల్‌లో వున్నట్లు పోలీసులు చెపుతున్నారు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తరువాత డేరా సచ్చా సౌధా బాధ్యతలు చేపడుతుందని అందరూ భావిస్తూ వచ్చిన హనీప్రీత్ సింగ్ నేపాల్‌కు పారిపోయింది. ఈమె కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో హనీప్రీత్ సింగ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన అభిమాన నటి అయిన కత్రినా కైఫ్‌లా కనిపించాలన్న ఉద్దేశంతో హనీప్రీత్ సింగ్ ఎంతో కష్టపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్‌కు పారిపోయినట్టు తేల్చిన పోలీసులు, ఆమె కోసం వేట ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. 
 
వయసు పెరుగుతున్న కొద్దీ, ఆమెకు తన అందంపై దిగులు ఎక్కువగా ఉండేదని, కత్రినాలా చాలా కాలం అందంగా ఉండాలని కోరుకునే ఆమె, ఎంతో శ్రమించి రోజుకు మూడు గంటల పాటు ఎక్సర్ సైజులు చేసేదని ఆమె పర్సనల్ జిమ్ ట్రైనర్ మీడియాకు తెలిపాడు. 
 
ఎక్సర్ సైజ్‌లు చేస్తూ అలసిపోయినట్టు అనిపిస్తే, వెంటనే ''ధూమ్-3''లోని కత్రినా పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ, అలసటను మరచిపోయేదని, గుర్మీత్ కూడా అక్కడే వర్కవుట్లు చేసేవాడని తెలిపాడు. ఇక గుర్మీత్, హనీప్రీత్ అనుక్షణం ఏకాంతంగా గడుపుతూ ఉండేవారని..ఎప్పుడన్నా బయటకు వెళ్తే.. ఒకే గదిలో బసచేసేవారని ఓ సాధ్వి వ్యాఖ్యానించింది. కాగా, ప్రస్తుతం పోలీసులు హనీప్రీత్‌తో పాటు డేరా ప్రతినిధిగా ఉండి, ప్రస్తుతం తప్పించుకు తిరుగుతున్న ఆదిత్య ఇన్సాన్ కోసం కూడా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments