Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరిది శవాన్ని భర్తతో కలిసి మోసిన వదిన.. ఎక్కడ?

పాము కరిచి మరిది చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు అన్నా వదినలు. అంతే వైద్యులు ఆంబులెన్స్ ఇవ్వలేదు. ఇక చేసేది లేక చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరోపక్క మరిది శవాన్ని భర్తతో కలసి మో

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (11:35 IST)
పాము కరిచి మరిది చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు అన్నా వదినలు. అంతే వైద్యులు ఆంబులెన్స్ ఇవ్వలేదు. ఇక చేసేది లేక చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరోపక్క మరిది శవాన్ని భర్తతో కలసి మోసేందుకు ఆ వదిన సిద్ధమైంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్ అనే యువకుడిని ఓ పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. 
 
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర మృతి చెందాడని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యులు శవాన్ని గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇచ్చేది లేదన్నారు. బతిమాలినా ప్రయోజనం లేకపోవడంతో మృతుడి అన్న, వదినలు తామే శవాన్ని మోశారు. స్థానికుల సాయంతో రాజేంద్ర శవం గ్రామానికి చేరింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇద్దరు అధికారులపై వేటు పడింది.

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments