Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు.. విపక్షాలకు పెళ్ళి చెడగొట్టడమే తెలుసు: నారా లోకేష్

ఏపీ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 90 రోజుల్లోనే రెండు కొత్త ఐటీ విధానాలు తీసుకొచ్చామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. 30 ఐటీ కంపెనీలు వచ్చి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు. వ

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (10:27 IST)
ఏపీ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 90 రోజుల్లోనే రెండు కొత్త ఐటీ విధానాలు తీసుకొచ్చామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. 30 ఐటీ కంపెనీలు వచ్చి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు. వచ్చే రెండు నెలల్లో మరో 10-15వేల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 2019కల్లా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని తాను ప్రకటించానని, దాన్ని సాధించే దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. 
 
త్వరలోనే ఏపీ క్లౌడ్‌ హబ్‌ విధానాన్ని ప్రకటించనున్నామని.. విజయవాడ ఆటోనగర్‌లోని కే-బిజినెస్‌ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటైన ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించిన సందర్భంగా నారా లోకేష్ అన్నారు. ఐటీ రంగంలో ఇప్పుడు డాటాఅనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరిగిందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించనున్నట్లు నారా లోకేష్ చెప్పారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆసియాలోని పెద్దపెద్ద డాటా అనలిటిక్స్‌ సంస్థలు రాష్ట్రానికి రానున్నాయని వివరించారు
 
ఇప్పటికే తిరుపతిలోనే ఎలక్ట్రానిక్స్‌ రంగంలో లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించనున్నామన్నారు. సెప్టెంబరుకల్లా తిరుపతి వద్ద కార్బన్‌ సెల్‌ఫోన్‌ కంపెనీ ప్రారంభం కానుందని వివరించారు. విపక్షాలకు ఐటీ గురించి తెలియదని, తెలిసిందల్లా పెళ్లి చెడగొట్టడమేనని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments