Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు : హస్తం చేతికి చిక్కిన బీజేపీ మంత్రి

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (12:58 IST)
అస్సాంలో అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీకి తేరుకోలేని షాక్ కొట్టింది. మంత్రి స‌మ్ రోంగ్‌హంగ్ బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జితేంద్ర సింగ్‌, పార్టీ స్టేట్ యూనిట్ చీఫ్ రిపున్ బోరా స‌మ‌క్షంలో స‌మ్ రోంగ్‌హంగ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రోంగ్‌హంగ్‌కు కాంగ్రెస్ నేత‌లు పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి స‌మ్ రోంగ్‌హంగ్ మాట్లాడుతూ.. త‌న‌కు టికెట్ కేటాయించ‌క‌పోవ‌డం తీవ్రంగా బాధించింద‌ని పేర్కొన్నారు. తాను అంకిత‌భావంతో ప‌ని చేసిన‌ప్ప‌టికీ బీజేపీ త‌న‌కు టికెట్ ఎందుకు నిరాక‌రించిందో అర్థం కావ‌డం లేద‌న్నారు. కావాల‌నే కొంద‌రు కుట్ర చేసి త‌న‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ డిఫు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రోంగ్‌హంగ్ పోటీ చేసే అవ‌కాశం ఉన్న‌ది. 
 
కాగా, మొత్తం 126 శాస‌న‌స‌భ స్థానాలు ఉన్న అసోంలో మూడు విడుత‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలి ద‌శ‌లో భాగంగా 12 జిల్లాల్లోని 47 స్థానాల‌కు మార్చి 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. రెండో ద‌శ‌లో భాగంగా 13 జిల్లాల్లోని 39 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఏప్రిల్ 1న, తుది ద‌శ‌లో భాగంగా 12 జిల్లాల్లోని 41 స్థానాల్లో ఏప్రిల్ 6న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 
 
అలాగే, అస్సాంతో పాటు.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారంలో నిమగ్నమైవున్నాయి. ముఖ్యంగా, బీజేపీ విజయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments