నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ... ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయన్నారు. మే 2న ఓట్ల లెక్కింపు జరుపుతారు.
కేరళలో ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2 న ఓట్ల లెక్కింపు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరుగుతాయి. 1వ దశ పోలింగ్- మార్చి 27, రెండవ దశ పోలింగ్- ఏప్రిల్ 1, మూడవ దశ పోలింగ్- ఏప్రిల్ 6; మే 2న లెక్కింపు వుంటుంది.
పశ్చిమ బెంగాల్ మార్చి 27న మొదటి దశ పోలింగ్, ఏప్రిల్ 1న రెండవ దశ పోలింగ్, ఏప్రిల్ 6న మూడవ దశ పోలింగ్, ఏప్రిల్ 10న నాల్గవ దశ పోలింగ్, ఏప్రిల్ 17న ఐదవ దశ పోలింగ్, ఏప్రిల్ 22న ఆరవ దశ పోలింగ్, ఏడవ దశ- ఏప్రిల్ 26, చివరి దశ పోలింగ్- ఏప్రిల్ 29. ఓట్ల లెక్కింపు మే 2.
కాగా కేరళలో 140 అసెంబ్లీ స్థానలతో పాటు అస్సోం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు 16 రాష్ట్రాల్లో 34 స్థానాలకు ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.