మానవత్వమా.. ఏదీ నీ చిరునామా? కూతురి శవంతో 4 కి.మీ.లు నడక (Video)

ప్రస్తుత సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. మనిషి ప్రాణాలు పోతున్నా… సాటి మనుషులు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కళ్లెదుటే పలువురు తిరిగిరానిలోకాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సం

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (11:22 IST)
ప్రస్తుత సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. మనిషి ప్రాణాలు పోతున్నా… సాటి మనుషులు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కళ్లెదుటే పలువురు తిరిగిరానిలోకాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి బీహార్ రాష్ట్రంలో జరిగింది. అదీ కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. 
 
ఓపీ కార్డు సమయానికి అందక.. ఓ చిన్నారి(9) ప్రాణాలు కోల్పోయింది. చివరికి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకూ అంబులెన్స్‌ ఇవ్వడానికి కూడా హాస్పిటల్ సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో వేరే గతిలేక ఆ తండ్రి తన కుమార్తె శవాన్ని 4 కిలోమీటర్ల పాటు భుజాన మోసుకుంటూ వెళ్లాడు.
 
ఈ వివరాల్లోకి వెళితే… లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్‌ బాలక్‌ దంపతుల కుమార్తె రౌషణ్‌ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది తొలుత ఔట్‌ పేషంట్‌(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్‌ బాలక్‌ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె విషమిమించింది. 
 
ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందికి చెప్పినావారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఓపీ కార్డు తెస్తేనే చికిత్స ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. చివరికి ఓపీ కార్డు తీసుకుని వచ్చేసరికి రోషణ్‌ కుమారి ప్రాణాలు కోల్పోయింది.
 
దీంతో ఆ తల్లిదండ్రులు కుమార్తె శవంముందు కూలబడిపోయి బోరున విలవించారు. ఆ తర్వాత చేసేదేం లేక కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ సమకూర్చాలని కోరారు. అయినా.. ఆస్పత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో చేసేది లేక.. తానే భుజంపై వేసుకుని… 4 కిమీ.లు నడిచి ఇంటికి తీసుకెళ్లి, అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించక పోవడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi : హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రిచర్డ్ రిషి చిత్రం ద్రౌపది 2

OG Review: పవన్ కళ్యాణ్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ఓజీ ఒరిజినల్ రివ్యూ

11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments