Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ ముఖం నాకు సరిగా కన్పించడం లేదు. హెల్మెట్‌ తీసేయి... ప్రియుడిపై యాసిడ్ దాడి

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (13:19 IST)
ఇటీవలి కాలంలో ప్రేమించలేదనో.. పెళ్లికి అంగీకరించలేదనో జరిగే దాడులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, అమ్మాయిలను వేధించే పోకిరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఓ యువతి ఓ యువకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ప్రేమించలేదన్న కారణంతో ఈ దారుణానికి పాల్పడింది. 
 
ఢిల్లీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన యువతీయువకులు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వారిద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ప్రియురాలు ఒత్తిడి చేస్తూ వచ్చింది. కానీ, అతను పెద్దగా పట్టించుకోకుండా, పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడు. పైగా, మనిద్దరం విడిపోదామని కోరాడు. 
 
ఈ మాటలను ఆమె జీర్ణించుకోలేక పోయింది. పైగా, అతనిపై యాసిడ్ దాడి చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 11వ తేదీన ఇద్దరూ బైకుపై బయటకు వెళ్లారు. 'నీ ముఖం నాకు సరిగా కన్పించడం లేదు. హెల్మెట్‌ తీసేయి' అని ఆమె అడుగగా, హెల్మెట్ తీసి బైక్‌ను నడపడం ప్రారంభించాడా యువకుడు.
 
ఆ సమయంలో తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతనిపై చల్లింది. ఈ ఘటనలో అతనికి మెడ, గొంతు, ముఖంపై గాయాలు కాగా, యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఇద్దరినీ ఆసుపత్రికి చేర్చి కేసు నమోదు విచారణ చేపట్టారు. పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ పనికి పాల్పడినట్టు చెప్పడంతో ఆ యువతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments