Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవ పడుతున్న భార్యకు ముద్దిచ్చిన భర్త.. ఇదే అదునుగా నాలుక కొరికేసిన భార్య...

సాధారణంగా భార్యాభర్తల గొడవలు కామన్. కానీ, కొంతమంది భార్యలు, భర్తలు మాత్రం ఈ అలూమగల గొడవలను పెద్దవి చేసి బూతద్దంలో చూస్తుంటారు. ఫలితంగా విపరీత పరిణామాలను ఎదుర్కొంటుంటారు.

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (09:06 IST)
సాధారణంగా భార్యాభర్తల గొడవలు కామన్. కానీ, కొంతమంది భార్యలు, భర్తలు మాత్రం ఈ అలూమగల గొడవలను పెద్దవి చేసి బూతద్దంలో చూస్తుంటారు. ఫలితంగా విపరీత పరిణామాలను ఎదుర్కొంటుంటారు. తాజాగా తనతో గొడవ పడుతున్న భార్యను చల్లబరుద్దామని భావించిన భర్త.. భార్యకు ముద్దిచ్చాడు. ఇదే అదునుగా భావించిన భార్య... భర్త నాలుకను కొరికేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది.
 
సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఔటర్ ఢిల్లీలోని రణహోలా ప్రాంతానికి చెందిన కరణ్ ఆర్టిస్టుగా పనిచేస్తూ భార్యతో కలిసి నివాసముంటున్నాడు. వీరిద్దరికి రెండేళ్ల క్రితం వివాహమైంది. అయినప్పటికీ కరణ్‌కు అతని భార్య భర్తతో వైవాహిక జీవితంపై అసంతృప్తిగా ఉండేది. తరచూ భార్య భర్త కరణ్‌తో గొడవలు పడేది. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తతో భార్య గొడవపడింది. ఈ క్రమంలో భార్య ఆగ్రహాన్ని చల్లార్చేందుకు భర్త కరణ్ భార్యకు ముద్దిచ్చాడు. అంతే ఇదే అదనుగా భావించిన భార్య ఆగ్రహంతో భర్త కరణ్ నాలుకను కొరికేసింది. 
 
నాలుక తెగిపోవడంతో కరణ్ హుటాహుటిన సఫ్టర్ జంగ్ ఆసుపత్రిలో చేరారు. కరణ్ నాలుకకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే కరణ్‌కు మాటలు రావడం లేదు. నిందితురాలైన భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు డీసీపీ సేజు కురువిల్లా చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments