Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారని... కొడుకు ఏం చేశాడంటే...

ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారన్న కోపంతో పరువు కోసం 21 ఏళ్ల కొడుకు వారిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (09:26 IST)
ఢిల్లీలో దారుణం జరిగింది. తల్లీ, చెల్లెలు వ్యభిచారం చేస్తున్నారన్న కోపంతో పరువు కోసం 21 ఏళ్ల కొడుకు వారిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీ నజాఫ్‌ఘడ్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో ఓ తల్లితో పాటు.. కుమార్తె, కుమారుడు నివశిస్తున్నారు. వీరిలో తల్లి సునీతకు 40 ఏళ్లు, కుమార్తెకు 15 యేళ్లు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన కుమారుడు.. తమ కుటుంబ పరువు తీస్తున్నాడని భావించారు. అంతే... తన ఇద్దరు స్నేహితులతో కలిసి పథకం పన్ని హతమార్చాడు. 
 
సునీత కుమారుడైన సుమీత్ తన ఇద్దరు స్నేహితులైన ధర్మాబీర్ (28), ప్రదీప్ (15)లతో కలిసి తల్లీ, చెల్లిని చంపాడని పోలీసులు చెప్పారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సునీతతోపాటు ఆమె కూతురిని రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్‌లో ఉన్న ఖటుశ్యాం దేవాలయ సందర్శనకు ధర్మాబీర్ తన కారులో తీసుకువచ్చాడు. 
 
అక్కడికి సమీపంలోని మానేసర్ లోని ఇండస్ట్రియల్ మోడల్ టౌన్ షిప్ ప్రాంతంలో తల్లీ కూతుళ్లను ముగ్గురు యువకులు కలిసి వారికి దుపట్టా చుట్టి దేశీ తుపాకులతో కాల్చి చంపారు. వారి మృతదేహాలను మైదానంలో పడేసి ఏమీ ఎరగనట్లు ఢిల్లీకి తిరిగివచ్చారు. పోలీసులు అనుమానంతో సుమిత్ ను పట్టుకొని ప్రశ్నిస్తే అసలు హత్య విషయం వెలుగు చూసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments