Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 12న ఢిల్లీ రోడ్లు దిగ్బంధం

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:43 IST)
వివాదస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రతిపాదనను రైతులు ఏకగ్రీవంగా తిరస్కరించడమే కాకుండా డిసెంబర్ 14న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా డిసెంబర్ 12 ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని సింఘూ సరిహద్దు రైతులు ప్రకటించారు. 
 
కేంద్రం ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని, తమ డిమాండ్లను తూచా తప్పకుండా కేంద్రం ప్రభుత్వం ఆమోదించే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు పేర్కొన్నారు.
 
రైతు ఉత్పత్తుల సేకరణకు ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుందని, ఈ మేరకు లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ ప్రతిపాదనలో కేంద్రం పేర్కొంది.

అయితే వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం మినహా మరే ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదనను అన్ని రైతు సంఘాలు కలిసి ఏకగ్రీవంగా తిరస్కరించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments