Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తినలో మరో మంకీపాక్స్ కేసు.. 22 యేళ్ల యువతికి పాజిటివ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (18:52 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. 22 యేళ్ళ యువతికి ఈ వైరస్ పాజిటివ్‌‌గా తేలింది. ఇటీవల ఆఫ్రికా దేశమైన నైజీరియా నుంచి వచ్చిన 22 యేళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌కు జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. 
 
ఈ బాధితురాలు నైజీరియా దేశానికి చెందిన యుతే. ఆమె అక్కడ నుంచి భారత్‌కు వచ్చే ముందే మంకీపాక్స్ వైరస్ సోకివుంటుందని ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈమె అనారోగ్యం బారినపడటంతో ఢిల్లీలోని ఎల్.ఎన్.జె.పి. ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఇదిలావుంటే, పాజిటివ్ వచ్చిన నైజీరియా యువతితో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మహిళలుకాగా, ముగ్గురు పురుషులు. ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారని.. మిగతా నలుగురు ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments