Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లీష్ చక్కగా మాట్లాడినా చితక్కొడుతారు... ఎక్కడ?

దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అంతేనా, ఇతర నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ నగరం రాజధానిగా మారింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఇంగ్లీషులో చక్కగా మాట్లాడినందుక

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (11:07 IST)
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అంతేనా, ఇతర నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ నగరం రాజధానిగా మారింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఇంగ్లీషులో చక్కగా మాట్లాడినందుకు ఐదుగురు వ్యక్తులు రౌండప్ చేసి చితకబాదారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పోలీసుల కథనం ప్రకారం.. 22 యేళ్ళ గులాటి అనే యువకుడు కన్నాట్ ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ వద్ద తన స్నేహితుడు దక్ష్‌ను దిగబెట్టి... అతడితో కాసేపు ఇంగ్లీష్‌లో మాట్లాడి తిరిగి బయలుదేరాడు. 
 
ఇది చూసిన ఐదుగురు వ్యక్తులు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడినందుకు అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. అతడిని రౌండప్ చేసి దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఓ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. 
 
అయితే వాహనం నంబరును గుర్తుపెట్టుకున్న గులాటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నంబరు ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments