ఆయన ఎమ్మెల్యే కాదు.. ఓ రేపిస్ట్ : దోషిగా బీజేపీ నేత నిర్ధారణ

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (10:50 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన్ను ఓ రేపిస్ట్‌గా కోర్టు అభివర్ణించింది. సమాజంలో పలుకుబడిగల వ్యక్తి (ఎమ్మెల్యే)కి వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితురాలు కొంత సమయం తీసుకున్నదని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం సత్యమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
పైగా, ఈ కేసు విచారణలో కూడా సీబీఐ అధికారులు తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక నిబంధనలను యధేచ్చగా ఉల్లింఘించారంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. ముఖ్యంగా, ఈ కేసులో చార్జిషీటు దాఖలులో జాప్యం చేయడం, దర్యాప్తు సమయంలో అధికారి లేకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. 
 
పోక్సో చట్టంలో లోపంలేదని, అధికారుల అసమర్థత, అమానవీయ దృక్పథం వల్లనే బాధితులకు న్యాయం ఆలస్యంగా అందుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో మరో నిందితుడు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు.. దోషిగా ఖరారైన కుల్దీప్ సెంగార్‌కు విధించాల్సిన శిక్షపై బుధవారం విచారణ జరుపనుంది. ఉన్నావ్ లైంగికదాడి కేసుతో సంబంధమున్న మరో నాలుగు కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments