ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కబడ్డీ ఆడేందుకు మైదానంలోకి వెళ్ళిన ఓ క్రీడాకారిణిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. కబడ్డీ ఆడేందుకు మైదానంలోకి వెళ్ళిన ఓ క్రీడాకారిణిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కబడ్డీ క్రీడాకారిణి అయిన 16 యేళ్ల అమ్మాయి ప్రాక్టీసు చేసేందుకు ఢిల్లీలోని చహత్రాసాల్ స్టేడియానికి వచ్చింది. తాను స్టేడియం నిర్వహణాధికారినని... కబడ్డీలో మంచి అవకాశాలు కల్పిస్తానని ఆశ పెట్టి అమ్మాయిపై ఓ ఆగంతకుడైన 30 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు.
ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ ఘటన అనంతరం బాధిత అమ్మాయి అనారోగ్యానికి గురవడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.