Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని హస్తినలో కలకలం : మూసివున్న ఇంట్లో నాలుగు మృతదేహాలు

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:43 IST)
రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఇంటి యజమాని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఇది రోహిణిలోని నాహర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక బస్సు డ్రైవర్ ముందుగా తన భార్య, పిల్లలను హత్య చేశాడు. తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
అలాగే తాగినమైకంలో ఆ డ్రైవర్ ఈ హత్యలకు పాల్పడివుండవచ్చని కూడా భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణి ప్రాంతానికి చెందిన డ్రైవర్ ధీరజ్(30) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments