మందుబాబులకు గుడ్ న్యూస్.. ఆర్డర్ చేస్తే చాలు.. ఇంటికే డెలివరీ

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (12:35 IST)
కరోనా నియంత్రణ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ విధించడంతో ఆయా రాష్ట్రప్రభుత్వాల ఆదాయం భారీగా పడిపోతుంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ పెట్టినప్పటికి ఆదాయం వచ్చే మార్గాల కోసం ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయి. 
 
చాలా రాష్ట్రాలకు మద్యం అమ్మకమే ప్రధాన ఆదాయ వనరు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మద్యం హోం డెలివరీకి అనుమతి ఇవ్వగా.. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చిన వారికి హోం డెలివరీ చేసుందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
 
ప్రస్తుతం ఢిల్లీలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ, విదేశీ మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ చట్టాలను సవరించారు. అయితే.. హాస్టళ్లకు, ఆఫీసులకు మాత్రం మద్యం హోం డెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు.
 
కానీ ఖచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ ఉండదన్నారు. ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయరాదు అని ఢిల్లీ అబ్కారీ శాఖ ఓ ప్రకనటలో తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments