Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (13:38 IST)
మరికొన్ని గంటల్లో సాఫీగా ముగియాల్సిన పెళ్లి ఒక్క క్షణంలో ఆగిపోయింది. పెళ్లి మండప వేదికపై వరుడు తన స్నేహితులతో కలిసి 'ఛోళీకే పీఛే క్యాహై' అనే పాటకు వరుడు డ్యాన్స్ చేశాడు. ఇది చూసిన వధువు తండ్రికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే.. పెళ్లిని రద్దు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని ఓ వివాహ వేడుకలోనూ ఇలాగే స్నేహితులు పిలవడంతో పెళ్లికొడుకు వారితో పాటు స్టెప్పులేశాడు. బాలీవుడ్‌లో ఒకప్పుడు ఉర్రూతలూగించిన 'ఛోళీకే పీఛే క్యాహై..' పాటకు పెళ్లికొడుకు డ్యాన్స్ చేయడం చూసి అతిథులు నవ్వుకున్నారు. సరదాగా సాగిన ఈ సన్నివేశం వధువు తండ్రికి మాత్రం చిరాకు తెప్పించింది.
 
'ఛీ ఛీ.. ఆ పాటేంటి, నీ డ్యాన్స్ ఏంటి' అని మండిపడుతూ పెళ్లిని రద్దు చేశాడు. ఇలాంటి పాటకు రోడ్డు మీద తైతక్కలాడే వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేయలేనని తేల్చిచెప్పాడు. ఆ తర్వాత ఎవరు ఎంతగా సర్దిచెప్పాలని చూసినా ఆయన వినిపించుకోలేదు. తండ్రి నిర్ణయంతో చేసేదేంలేక వధువు కన్నీళ్లతో వేదిక దిగిపోయింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
 
ఈ సంఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. వధువు తండ్రి చేసింది కరెక్టే, పెళ్లి రద్దు చేయకుంటే రోజూ ఆ డ్యాన్స్ చూడాల్సి వచ్చేదని కొందరు, ఇది అరేంజ్ డ్ మ్యారేజ్ కాదు, ఎలిమినేషన్ రౌండ్ జరుగుతోందని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు మాత్రం పెళ్లికొడుకును సమర్థిస్తూ.. ఛోళీకే పీఛే సాంగ్‌కు ఉన్న ఊపు అలాంటింది, ఆ పాట ప్లే చేస్తుంటే ఎవరైనా సరే డ్యాన్స్ చేయాల్సిందే. నా పెళ్లిలో ఆ పాట పెడితే నేను కూడా డ్యాన్స్ చేస్తానని కామెంట్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన రామ్ చరణ్

సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని అన్నాను... అందుకే ఆ పని చేశా... (Video)

ఘాటి షూట్ లో కారు బురదలో ఇరుక్కుపోయింది : జగపతిబాబు

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments