Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగినితో అక్రమ సంబంధం... గుజరాత్‌లో శవమైతేలిన ఢిల్లీ వ్యాపారి!

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (11:20 IST)
తన వద్ద పనిచేసే ఓ ఉద్యోగినితో కంపెనీ యజమాని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఉద్యోగిని కుటుంబ సభ్యులకు తెల్సిందే. అంతే.. మాట్లాడుకుందామని ఇంటికి పిలిచారు. అక్కడ ఆయనను చితకబాది హత్య చేశారు. ఈ హత్యకు ఉద్యోగిని తల్లితో పాటు.. మరో వ్యక్తి కూడా సహకరించారు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి గుజరాత్‌లో పడేశారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన నీరజ్ గుప్తా (46) అనే వ్యాపారి, తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులతో పాటు.. కాబోయే భర్తకు తెలిసింది. అంతే.. మాట్లాడుకుందాం ఇంటికి రమ్మని నీరజ్ గుప్తాను పిలిచారు. వారి మాటలు ఉద్యోగిని ఇంటికి ఈ నెల 13వ తేదీన వ్యాపారి వెళ్లాడు.
 
ఆ తర్వాత అతని ప్రియురాలు, ఆమె తల్లి, కాబోయే భర్త తదితరులు కలిశారని, ఆపై వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత, తొలుత నీరజ్ తలపై ఇటుకతో కొట్టి, ఆపై కడుపులో మూడు సార్లు పొడిచి, గొంతుకు ఉరి బిగించి హత్య చేశారని, ఇందుకు సదరు యువతి, ఆమె తల్లి కూడా సహకరించారు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేసులో పెట్టి, రైలెక్కి, గుజరాత్ వరకూ ప్రయాణించి, భారుచ్ ప్రాంతంలో పడేసి వచ్చాడు.
 
అయితే, తన భర్త నీరజ్ గుప్తా కనిపించడం లేదని ఆయన భార్య ఆదర్శ్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పైగా, తన భర్త అక్రమ సంబంధం గురించి భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఆపై గుజరాత్‌లో బయటపడిన మృతదేహం నీరజ్‌దేనని గుర్తించామని, కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ కేసులో యువతి ఫైసల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), ఫైసల్‌కు కాబోయే భర్త జుబేర్ (28)లను అరెస్ట్ చేశామని పోలీసు అధికారి విజయాంత ఆర్యా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments