Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:44 IST)
ఢిల్లీలోని ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ)కి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ పేలుడులో ఇరాన్‌తో సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పేలుడు ప్రాంతంలో లభించిన ఎన్వలప్‌తో ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తేలిందని, వారి లక్ష్యం భారత్‌లోని ఇజ్రాయిల్‌ సంస్థలని పోలీసులు తెలిపారు.

దీంతో ఇజ్రాయిల్‌తో సంబంధాలు ఉన్న అన్ని ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను వినియోగించినట్లు సమాచారం.

గత నెల భారత్‌కు వచ్చిన ఇరానీయులను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థలైన ఐబి, ఇమ్మిగ్రేషన్‌ సహా కేంద్ర సంస్థల సహాయాన్ని తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రెండు రోజుల పశ్చిమబెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments