Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ లీడర్ జీతూ చౌదరి దారుణ హత్య.. బైక్‌పై వచ్చారు.. కాల్చేశారు..

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని మయూరు విహార్ ప్రాంతంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు జీతూ చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మయుర్​విహార్ ప్రాంతంలోని ఫేజ్ 3లో నివసించే జీతూ చౌదరి బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చొని ఉన్నాడు. 
 
అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. 
 
కాల్పులకు గురైన జీతూను స్థానికులు, కుటుంబసభ్యులు హుటాహుటిన నోయిడాలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జీతూ చౌదరి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments