Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు కాన్పు చేసిన పదేళ్ల కుమారుడు.... ఎక్కడ?

ఓ పదేళ్ళ బాలుడు కన్నతల్లికి సురక్షితంగా కాన్పు చేశాడు. అదీ కూడా ఏ ఒక్కరి సహాయం లేకుండా ప్రసవం చేసి తన తమ్ముడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా రక్షించుకున్నాడు. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీల

అమ్మకు కాన్పు చేసిన పదేళ్ల కుమారుడు.... ఎక్కడ?
Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (06:04 IST)
ఓ పదేళ్ళ బాలుడు కన్నతల్లికి సురక్షితంగా కాన్పు చేశాడు. అదీ కూడా ఏ ఒక్కరి సహాయం లేకుండా ప్రసవం చేసి తన తమ్ముడికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా రక్షించుకున్నాడు. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీకి చెందిన అష్లే మోరీ (36), కెల్సీ రీచర్డ్ అనే దంపతులు ఉద్యోగస్తులు. కెల్లీ రీచర్డ్ ఆఫీసుకి వెళ్ల‌గా, గ‌ర్భ‌వ‌తి అయిన‌ అష్లే ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో కడుపులో కొంచెం నొప్పి రావ‌డంతో అష్లే బాత్‌రూంకు వెళ్లింది. అయితే, నొప్పులు తీవ్రం అయి బాత్రూంలోనే పడిపోయింది.
 
ఆసమయంలో ఇంట్లో తన ప‌దేళ్ల‌ కుమారుడు ఫాంటెనాట్‌ జేడెనే త‌ప్ప ఎవ్వ‌రూ లేరు. ఆ బాలుడు ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అయితే, ఆసుప‌త్రి సిబ్బంది వ‌చ్చేసరికి ఆల‌స్యం అవుతుంద‌ని భావించిన బుడతడు... ఇపుడు ఏం చేయాలో తనకు చెప్పాలని త‌ల్లిని అడిగాడు. ఆమె వివరిస్తుంటే జేడెనే కాన్పు చేశాడు. ఆ బాలుడికి ఓ త‌మ్ముడు పుట్టాడు. 
 
కానీ, ఆ శిశువు శ్వాస తీసుకోవ‌డం లేదు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ బాలుడు వంటగదిలోని నాజిల్‌ ద్వారా కృత్రిమ శ్వాసను అందించాడు. ఇంత‌లో ఆసుపత్రి నుంచి సిబ్బంది వ‌చ్చి తల్లీ బిడ్డను ఆస్పత్రికి తరలించారు. నిజానికి పుట్టిన శిశువుకి కృత్రిమ శ్వాసను అందించకపోయి ఉంటే ఆ శిశువు మృతి చెందేవాడని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్టు వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్‌ కిరణ్‌ తిరుమలశెట్టిపై దాడి

పవన్ కళ్యాణ్ ఓకే అంటేనే ఏపీలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్

విదేశీ డాన్సర్లు, టెక్నీషియన్లతో గేమ్ ఛేంజర్ ఐదు పాటలకు రూ.75 కోట్లు ఖర్చు

Varun Dhawan: సమంత, కీర్తి సురేష్‌‌లకు కలిసిరాని వరుణ్ ధావన్.. ఎలాగంటే?

Game Changer: 256 అడుగుల ఎత్తులో రామ్ చరణ్ కటౌట్.. హెలికాప్టర్ ద్వారా పువ్వుల వర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments