బీభత్సం సృష్టించిన షహీన్ తుఫాను - నీట మునిగిన బెంగుళూరు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (15:01 IST)
షహీన్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల దెబ్బకు కర్నాటక రాజధాని బెంగుళూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముఖ్యంగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 
 
ఈ తుఫాను ప్రభావం కారణంగా కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
 
బెంగుళూరులో భారీ వృక్షాలు నెలకొరిగి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని తుముకూర్​ రోడ్​, మైసూర్​ రోడ్​, బళ్లారి రోడ్​, మెజెస్టిక్​, ఛామరాజపేట్​, బసవన్నగుడి, యశ్వంతపుర్​, రాజరాజేశ్వరీ నగర్​, మహదేవపుర, హెబ్బల్​ ప్రాంతాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
కేఆర్​ పురా, మహదేవపుర, హోస్కెట్​, రాజరాజేశ్వరీ నగర్​లో 90-98 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అక్టోబర్​ 6 వరకు బెంగళూరుపై షహీన్​ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments