Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓఖీ తుఫాను.. తమిళనాడులో భారీ వర్షం.. తిరుమలలో కుండపోత

బంగాళాఖాతంలో ఏర్పడిన ఓఖీ తుఫాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ ఓఖీ తుఫాన్ ప్రభావం తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లపై అధికంగా ఉంది. తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉన్న తుఫాను వచ్చ

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (10:12 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన ఓఖీ తుఫాను అరేబియా సముద్రం మీదుగా పయనిస్తోంది. ఈ ఓఖీ తుఫాన్ ప్రభావం తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లపై అధికంగా ఉంది. తిరువనంతపురానికి 130 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమై ఉన్న తుఫాను వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్యంగా లక్షద్వీప్‌ దీవుల  దిశగా పయనించి తీవ్ర తుఫానుగా మారనుంది. 
 
ఈ తుఫాను కారణంగా తమిళనాడులోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, తిరుమలలో కూడా కుండపోత వర్షం పడుతోంది. ఈ వర్షాల వల్ల ఇప్పటివరకు తమిళనాడులో 8 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో చేపల వేటకు వెళ్లిన 80 మంది జాలర్లు సముద్రంలో గల్లంతయ్యారు. 
 
ముఖ్యంగా, సరిహద్దు జిల్లా అయిన కన్యాకుమారిలో విస్తారంగా వర్షం పడుతోంది. దీంతో జవనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలో వర్ష బీభత్సానికి నలుగురు మృతి చెందారు. జిల్లా మొత్తం విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. కన్యాకుమారి నుంచి బయలుదేరే అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దుచేశారు. గురు, శుక్రవారాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. 
 
మరోవైపు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా జోరువాన పడుతోంది. దీనికితోడు దట్టమైన పొగమంచు తిరుమల కొండను కప్పేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. కొండపై చలి తీవ్రత పెరిగింది. భక్తులు గదులకే పరిమితమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments