Webdunia - Bharat's app for daily news and videos

Install App

cyclone michaung తుఫాను: నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం, భారీ వర్షాలు

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (22:20 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం మధ్యాహ్నం అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం డిసెంబర్ 3న తుఫానుగా మారి డిసెంబర్ 4న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలోని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడటంలో జాప్యం జరుగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం మరింత బలపడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారి డిసెంబర్ 3న నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని, డిసెంబర్ 4 తెల్లవారుజామున దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని తుపాను చేరుకుంటుందని కేంద్రం తెలిపింది. 
 
తుపాను దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా ఉత్తరం వైపుగా కదులుతుందని, డిసెంబర్ 5 ఉదయం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో 80-90 కి.మీ వేగంతో గాలుల వేగం 100 కి.మీలకు పెరుగుతుందని భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది.
 
ప్రస్తుతం ఈ తుఫాను పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 730 కి.మీ, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 740 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 860 కి.మీ దూరంలో ఉంది. ఈ మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని, ఏపీలో దక్షిణ- ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.  
 
డిసెంబర్ 3, 4 తేదీల్లో తమిళనాడుకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను కూడా జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా చెన్నైతో పాటు 9 ఓడరేవుల్లో ఒకటో నంబర్ తుఫాను హెచ్చరికను జారీ చేయడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments