ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. స్కూటర్ నేర్చుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి ఆటోలో ఎత్తుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు. ఈ అత్యాచార ఘటన నవంబర్ 30 సాయంత్రం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధిత బాలిక స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నప్పుడు, ఆమె స్నేహితులు ఆమెతో వున్నారు. బాధితురాలిని కిడ్నాప్ చేస్తుండగా.. దుండగుల నుంచి ఆమెను కాపాడేందుకు స్నేహితులు ఎంతోగానో ప్రయత్నించారు. వారిని కూడా నిందితులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.