Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో బీజేపీ ఆఫీసులో వాస్తు మార్పులు.. కలిసొస్తుందా?

BJP
, శనివారం, 2 డిశెంబరు 2023 (13:55 IST)
BJP
కేంద్రంలో బీజేపీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయట్లేదు. ఉత్తరాదిలో బీజేపీ బలంగా వీస్తున్నప్పటికీ దక్షిణాదిలో మాత్రం నామమాత్రమే. 
 
అయితే తెలంగాణ నుంచి దక్షిణాదిలో సత్తా చాటాలని కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీతో పాటు మంత్రివర్గం అంతా తెలంగాణ కోసం క్యూ కట్టినా ఆ పని జరగలేదు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏంటో ఇంటో ప్రజాదరణ పొందింది. 
 
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం అంతా వచ్చి ప్రచారం చేసినా పెద్దగా ఫలితం లేదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 5 నుంచి 10 సీట్లు మాత్రమే సాధ్యమని అన్ని సర్వేలు చెప్పడంతో తెలంగాణలో బీజేపీకి తిరుగుండాలని రాష్ట్ర నాయకత్వం కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.
 
ఇంతకీ మార్పు ఏంటంటే.. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారా.. లేక ఈ రాష్ట్రానికి ఇంచార్జ్‌గా బడా నేతను నియమిస్తారో తెలియంది కాదు.. తెలంగాణలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కొన్ని వాస్తు మార్పులు చేశారు. 
 
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ ప్రవేశాన్ని మార్చాలని బీజేపీ నిర్ణయించింది. మొన్నటి వరకు తూర్పు ద్వారం నుంచి రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు వాస్తు ప్రకారం గేటును మూసివేయాలని పండితులు సూచించగా.. అందుకు బీజేపీ అగ్రనేతలు అంగీకరించారు. తూర్పు ద్వారం కాకుండా ఉత్తర ద్వారం నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించారు.
 
అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. హంగ్ వచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో బీజేపీ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. 
 
పోలింగ్ నుంచి ఫలితాలు వెలువడే వరకు తూర్పు ద్వారం మూసివేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఫలితాలు వెలువడే వరకు ఉత్తరం వైపు నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఇలా చేస్తే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని వాస్తు పండితులు సూచించినట్లు సమాచారం. 
 
మరి బీజేపీ చేస్తున్న ఈ వాస్తు మార్పులు ఆ పార్టీకి చక్రం తిప్పే అవకాశం ఇస్తాయో లేదో తెలియాలంటే డిసెంబర్ 3 సాయంత్రం వరకు ఆగాల్సిందే. మొన్నటి జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లు సమాచారం. 
 
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గతంలో రెండు ప్రవేశాలు ఉండేవి.. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇలా చేయడంతో.. బీజేపీకి మంచి సీట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు కమలం పార్టీకి చక్రం తిప్పే అవకాశం వస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారం ధరల్లో భారీ మార్పులు.. రూ.300కి పెరిగిన పసిడి ధర