Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణాజలాలపై తెలుగు రాష్ట్రాల ఫైట్.. కేంద్రం జోక్యం

Nagarjuna Sagar
, శనివారం, 2 డిశెంబరు 2023 (11:52 IST)
ఏపీ, తెలంగాణ మధ్య నిప్పు రాజేసిన నీటి వివాదం ఢిల్లీని తాకింది. తెలంగాణ ఫిర్యాదు మేరకు వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఏపీని ఆదేశించింది కృష్ణా రివర్‌బోర్డు. 
 
సరిగ్గా తెలంగాణలో పోలింగ్‌ టైమ్‌లోనే సాగర్‌ దగ్గర ఉద్రిక్తత చెలరేగడం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. కృష్ణా జలాల వివాదంపై కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. 
 
కృష్ణా ట్రిబ్యూనల్‌కు నూతన విధివిధానాలపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఏపీ ప్రభుత్వం. పిటీషన్‌ను విచారించిన సుప్రీం కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి, తెలంగాణకు నోటీసులు ఇచ్చింది. 
 
కౌంటర్‌ దాఖలకు కేంద్ర జలశక్తి శాఖ సమయం కోరడంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు 12కు వాయిదా వేసింది. ప్రస్తుతం సాగర్‌ డ్యామ్‌ సీఆరీపీఎఫ్‌ పర్యవేక్షణలో ఉంది. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో జరిగే కీలక భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

45 పాఠశాలలకు ఇ-మెయిల్ బాంబు బెదిరింపులు