Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లీజ్ ఐ. కైండ్ లీ రిక్వెస్ట్ వయెలెన్స్ వద్దంటున్న సాలార్ ఎందుకో తెలుసా!

salaar trailer
, శుక్రవారం, 1 డిశెంబరు 2023 (20:17 IST)
salaar trailer
ప్రభాస్ సాలార్ ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలయింది. అభిమానులకు విందులా ఇది కనిపిస్తుంది. పూర్తి యాక్షన్ కావాల్సినంత హింస వుంది. కె.జి.ఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్రైలర్ బాగా కట్ చేశాడు. చిన్నతనంలో దేవ (ప్రభాస్) తన స్నేహితుడు (ప్రుధ్విరాజ్ కుమార్) తో విడదీయలేని స్నేహం.. యర అయినా సొర అయిన అవుతా.. నీ ఒక్కడి కోసం. నువ్వు  ఎప్పుడు పిలిచినా వస్తా. అంటాడు. 
 
కట్ చేస్తే.. ఈ  కథ వెయ్యి ఏండ్ల క్రితం మొదలైంది అంటూ వాయిస్ తో ట్రైలర్ సాగుతుంది. మహమద్ గజనీ, చెంఘిజ్ ఖాన్ కంటే  క్రూరమైన బంది పోట్లు.. కాన్సార్ అడవిని కోటగా మార్చుకున్నారు.  కాలంతోపాటు అది పెద్ద సామ్రాజ్యంగా మారింది. దాని పెద్ద జగపతి బాబు. ఆయన కాలంలో కుర్చీ కోసం కుమ్ములాట మొదలవుతోంది. వ్యతిరేక వర్గం ప్రుధ్విరాజ్ కుమార్ ను చంపేయాలని ప్లాన్ చేస్తారు. తన  కుమారుడిని దొరగా చూడాలని జగపతి బాబు కోరిక. అదే టైంలో జగపతిబాబు ఊరెళతాడు. ఇదే అదనుగా ఎటాక్ ప్లాన్ చేస్తారు. ఆ టైంలో తన స్నేహితుడి కోసం ప్రభాస్ వస్తాడు. 
 
ఆ తర్వాత జరిగే యాక్షన్ కె.జి.ఎఫ్. కు మించినట్లుగా వుంది. మైనింగ్ గనుల్లో పోరాటం, కత్తులతో యుద్ధం వంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. మన ఆర్మీ ఎక్కడుంది అని ప్రుధ్వీరాజ్ కుమార్ అనగానే... ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడు. తన కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి అంటాడు. ఆ తర్వాత ప్రభాస్.. ప్లీజ్ ఐ. కైండ్ లీ రిక్వెస్ట్.. అనే డైలాగ్ తో ముగుస్తుంది.
 
మాస్ సినిమాకు తగినట్లుగా ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ విడుదలైంది. డిసెంబర్ 22 న సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూజిలాండ్‌లో బ్రహ్మానందంతో మోహన్ బాబు