Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్

Advertiesment
Kantara Chapter 1 First Look
, సోమవారం, 27 నవంబరు 2023 (17:40 IST)
Kantara Chapter 1 First Look
కాంతార సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. టీజర్‌లో రిషబ్ శెట్టి లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతోన్నారు.
 
దర్శకుడిగా రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ప్రపంచం ఎలా ఉండబోతోందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టీజర్లో వినిపించిన సంగీతం ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఏడు భాషల్లో కాంతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను రిలీజ్ చేశారు.
 
గత ఏడాది కాంతార దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాంతార చిత్రంలో చూపించిన విజువల్స్, ఆర్ఆర్, ప్రకృతికి మనిషికి ఉండాల్సిన బంధం, ఉన్న సంబంధాన్ని ఎంతో గొప్పగా చూపించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చే చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాంతార చాప్టర్ 1 కూడా దేశ స్థాయిలో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
 
కాంతార, కేజీయఫ్ చాప్టర్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్లను గత ఏడాది హోంబలే సంస్థ తమ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు చిత్రాలు కలిపి దాదాపు 1600 కోట్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి తమ సత్తా చాటబోతోన్నారు. సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
 
వచ్చే ఏడాది రానున్న కాంతార చాప్టర్ 1 మీద ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. డిసెంబర్‌‌లో ఈ సినిమా షూట్ పూర్తి చేసి.. ఆ తరువాత ప్రమోషన్స్ చేపట్టి చిత్రం మీద అంచనాలు పెంచనున్నారు. ఇప్పటికి ఇంకా ఈ సినిమా నటీనటుల్ని ప్రకటించలేదు. ఈ టీజర్‌తో కాంతార ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి భాషాబేధం లేకుండా ప్రేక్షకుల అందరిలోనూ చెరగని ముద్ర వేసేందుకు కాంతార చాప్టర్ 1 సిద్దమవుతోంది. రిషబ్ శెట్టి, హోంబల్ ఫిల్మ్స్ కలిసి కాంతార చాప్టర్ 1ని భారీ ఎత్తున రూపొందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరోం హర పవర్ ఆఫ్ సుబ్రమణ్యం టీజర్‌ విడుదల చేసిన ప్రభాస్, మమ్ముట్టి