Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీరందాటిన 'దానా' తుఫాను... ఒరిస్సా - బెంగాల్‍‌ రాష్ట్రాలు అతలాకుతలం

ఠాగూర్
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (08:19 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం దాటింది. గురువారం అర్థరాత్రి తర్వాత తీరాన్ని తాకింది. ఒరిస్సా రాష్ట్రంలోని బిత్తర్‌కని నేషనల్ పార్క్, ధ్రా మధ్య తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ తుఫాను తీరాన్ని తాకే స మయంలో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన ఈదురు గాలులు వీచాయి. గాలులు తీవ్రవతకు పలుచోట్లు చెట్లు కూలిపోయాయని పేర్కొంది. శుక్రవారం ఉదయం తుఫాను బలహీనపడుతుందని పేర్కొంది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం కారణంగా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
కాగా తుఫాను తీవ్రత దృష్ట్యా అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏకంగా 400లకు పైగా రైళ్లను భారత రైల్వే రద్దు చేసింది. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్ పోర్టు సేవలను గురువారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. సాయంత్రం శుక్రవారం 9 గంటల వరకు మూసి ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రభావిత తీర ప్రాంతాల్లోని లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కాగా దానా తుఫాను వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యురేఖా సకామిఖా ఫార్మెట్ లో మట్కా సెకండ్ సింగిల్ తస్సాదియ్యా వుందా?

లవ్ రెడ్డి నటుడిపై ప్రేక్షకురాలి దాడి, హైదరాబాద్ జీపీఆర్ మాల్ లో ఘటన

రికార్డ్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెెం.1 ప్లేస్ లో ప్రభాస్ రాజా సాబ్ మోషన్ పోస్టర్

డిసెంబర్ 5 న పుష్ప పార్ట్ 2: ది రూల్ - ఆనందంలో డిస్ట్రిబ్యూటర్స్‌

డియర్ కృష్ణ నుంచి ఎస్పీ బాలు పాడిన చివరి పాట విడుదల చేసిన మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతకాయలు వచ్చేసాయి, ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

వాష్ బేసిన్ తళతళ మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?

తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

జామ ఆకులుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

ఈ వ్యాధులకు మునగకాయలు దివ్యౌధంలా పనిచేస్తాయి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments