Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్వెల్ క్వారంటైన్‌లోని మహిళపై అత్యాచారం!!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (10:01 IST)
మహారాష్ట్రలోని పన్వెల్‌లో దారుణం జరిగింది. అసలే కరోనా వైరస్ సోకి క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఓ మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పన్వెల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి స్థానికంగా ఉండే కరోనా రోగులను, లక్షణాలు ఉన్నవారిని ఉంచుతున్నారు. ఇలాంటి వారిలో 40 ఏళ్ల మహిళ కూడా కరోనా పాజిటివ్‌తో అక్కడ చేరింది. 
 
ఆ మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. క్వారంటైన్‌లోని మహిళలు ఉండే విభాగంలో ఆ కామాంధుడు వచ్చి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపుతోంది. అయితే ఆ కామాంధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ సందర్భంగా పన్వెల్ జోన్-2 ఏసీపీ రవీంద్ర గీతే మాట్లాడుతూ, క్వారంటైన్ సెంటర్లో దాదాపు 400 మంది ఉన్నారని చెప్పారు. పాజిటివ్‌తో అక్కడున్న మహిళపై ఒక వ్యక్తి  అత్యాచారం చేశాడని.. విషయం తెలిసిన వెంటనే అతడిని అరెస్టు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 
 
మరోవైపు ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొన్ని క్వారంటైన్ సెంటర్లలో సరైన ఆహారం కూడా అందించడం లేదని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments