Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెల్ఫ్ కిట్... ఇక ఇంట్లోనే కోవిడ్ పరీక్షలు.. ధర రూ.250 మాత్రమే...

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (08:18 IST)
దేశ ప్రజలను కరోనా వైరస్ భయపెడుతోంది. ఈ వైరస్‌ ఉనికిని వేగంగా కనిపెట్టి, కట్టడి చేయడంలో భాగంగా కీలక ముందడుగు పడింది. ఇంటిదగ్గరే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి సాయపడే ‘హోం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌ (హోం ర్యాట్‌ కిట్‌)’కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సోమవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ కిట్‌తో కరోనా టెస్ట్‌ను ఎలా చేసుకోవచ్చు? ఫలితాన్ని ఎలా తెలుసుకోవచ్చో? చూద్దాం..
 
ఈ కిట్‌ వినియోగానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను ఐసీఎంఆర్‌ విడుదల చేసింది. ఆ వివరాలు..
 
* కరోనా లక్షణాలున్నవారు, పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను కలిసినవారు ‘హోం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌’ సాయంతో పరీక్షలు నిర్వహించుకోవచ్చు. అవసరం లేకపోయినా పరీక్షలు నిర్వహించటం చేయవద్దు. 
 
* పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్‌ స్ట్రిప్‌ను మొబైల్‌ యాప్‌, యూజర్‌ రిజిస్టర్‌ అయిన మొబైల్‌ ఫోన్‌లో ఫొటో తీయాలి.
* యాప్‌లో నమోదుచేసిన యూ జర్‌ డేటాను ఐసీఎంఆర్‌ కొవిడ్‌-19 టెస్టింగ్‌ పోర్టల్‌కు అనుసంధానమైన సర్వర్‌లో భద్రపరుస్తారు.
* హోం ర్యాపిడ్‌ టెస్టులో పాజిటివ్‌ వచ్చిన రోగులంతా 100 శాతం పాజిటివ్‌గానే భావించాలి. వీరికి మరోసారి పరీక్ష అవసరంలేదు. లక్షణాలు ఉన్నప్పటికీ, పరీక్షల్లో నెగెటివ్‌ వస్తే, ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి.
 
అసలు ఏమిటీ హోం ర్యాట్‌ కిట్‌?
వైద్య, ఆరోగ్య సిబ్బంది అవసరం లేకుండా ఇంట్లోనే సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి సాయపడేదే ‘హోం ర్యాట్‌ కిట్‌’. ఈ కిట్‌ను ‘కొవిసెల్ఫ్‌’ పేరిట మహారాష్ట్రలోని పుణెకు చెందిన మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ కంపెనీ తయారు చేసింది. త్వరలో ఈ కిట్లు మార్కెట్లోకి రానున్నాయి.
 
గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌లో ఉన్న హోంటెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ (మైల్యాబ్‌ కొవిసెల్ఫ్‌ యాప్‌) డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో పేర్కొన్న నిబంధనలను అనుసరించి పరీక్షలు జరుపాలి.
 
కిట్‌ను ఎలా ఉపయోగించాలంటే?
1. ‘కొవిసెల్ఫ్‌ హోం ర్యాట్‌ కిట్‌’లో.. పరీక్ష చేసుకునే వ్యక్తి నుంచి నమూనాలను సేకరించే స్వాబ్‌ స్టిక్‌, ద్రావణం నింపిన ఒక ట్యూబ్‌, ఒక టెస్ట్‌ కార్డ్‌, పౌచ్‌ ఉంటాయి.
 
2. స్వాబ్‌ స్టిక్‌ను నాసికా రంధ్రాల్లో 2-3 సెంటీమీటర్ల లోపలికి ఉంచి ఐదుసార్లు తిప్పాలి. అనంతరం ఆ నమూనాల్ని ద్రావణం ఉన్న ట్యూబ్‌లో ముంచి.. మార్క్‌ గుర్తు ఉన్న వరకు స్టిక్‌ను విరిచేయాలి. అనంతరం.. ట్యూబ్‌ మూత పెట్టాలి.
 
3. ట్యూబ్‌ నుంచి రెండు చుక్కలను టెస్ట్‌ కార్డుపై వేయాలి. అనంతరం 15 నిమిషాలు వేచిచూడాలి.
కార్డుపై సీ (కంట్రోల్‌), టీ (టెస్ట్‌) పేరుతో రెండు సెక్షన్లు ఉంటాయి.
 
4. నమూనాలతో కూడిన ద్రావణాన్ని కార్డుపై వేశాక.. ‘సీ’ సెక్షన్‌ వద్ద బార్‌ (సన్నని గీత) గుర్తు ఏర్పడితే, కరోనా నెగెటివ్‌గా భావించాలి. ‘సీ’, ‘టీ’ సెక్షన్‌ వద్ద బార్‌ (మొత్తం రెండు బార్లు) కనిపిస్తే పాజిటివ్‌గా గుర్తించాలి. మొబైల్‌ యాప్‌తో దీనిని సమీక్షించుకోవచ్చు.
 
5. మైల్యాబ్‌ హోంటెస్టింగ్‌ మొబైల్‌ యాప్‌ను ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని లాగిన్‌ అవ్వాలి. కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. అప్పుడు టెస్ట్‌ రిజల్ట్స్‌కు సంబంధించిన వివరాలు మొబైల్‌కు మెసేజ్‌ రూపంలో వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments