Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీజీ.. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి.. సోనియా గాంధీ

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (18:07 IST)
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత నాయకత్వం దేశాన్ని కుంటుపరిచింది. టీకా కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారని.. కానీ ఇందులో కోట్ల మంది దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులతో పాటు అట్టడుగున ఉన్నవారిని మినహాయించారన్నారు. 
 
ప్రజల పట్ల ప్రాథమిక బాధ్యతలు విధుల నుంచి మోదీ ప్రభుత్వం తప్పుకుంది. నేషనల్ టాస్క్‌ఫోర్స్, పార్లమెంటరీ ప్యానెల్‌ల నుంచి వచ్చిన హెచ్చరికలను గాలికి వదిలేశారంటూ సోనియా గాంధీ తెలిపారు. 
 
అలాగే దేశంలో కోవిడ్-19 పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోనియా సూచించారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాయంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ... అన్ని పార్టీలు కలిసి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుంటే ఆశాజనక ఫలితాలు వస్తాయన్నారు.  
 
దేశంలో రోజుకు నాలుగు లక్షలు దాటి కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే 3,900 మంది ఒకే రోజు మరణించారు. కానీ ప్రభుత్వ చర్యలు సరిగా లేవు. ఆక్సీజన్, మందులు, వెంటిలేటర్లు, బెడ్లు అన్నింటి కొరత ఉంది. వీటిని అందించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments